ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రాండ్‌గా ఉండబోయే ప్రాజెక్ట్‌గా రామాయణ రూపొందుతోంది. దర్శకుడు నితేష్ తివారి దీన్ని ఓ ల్యాండ్‌మార్క్ గాథగా నిలుపుతానన్న ధీమాతో షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ముంబై ఫిల్మ్ సర్కిల్స్ టాక్ ప్రకారం, రామాయణ పార్ట్ 1 ఇప్పటికే పూర్తి దశకు చేరిందట. అసలు ట్విస్ట్ ఏమిటంటే… యష్ నటించిన రావణుడి పాత్ర రామాయణ పార్ట్ 2లోనే కనిపించబోతుందట.
అంటే మొదటి భాగం ‘పట్టాభిషేకం’తో మొదలై ‘వనవాసం’ వరకే ముగియనుంది. రావణుడు, అశోకవనం, సీత హరణం వంటి సన్నివేశాలన్నీ పార్ట్ 2లో ఉండబోతున్నాయన్నది విశ్వసనీయ సమాచారం. రన్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ మైతలాకల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కి విఎఫ్‌ఎక్స్ కీలక అంశం. ఆదిపురుష్ సినిమాకు వచ్చిన విమర్శలు జాగ్రత్తగా విశ్లేషించి, వాటి పునరావృతం కాకుండా నితేష్ తివారి టీమ్ ఓవర్ కేర్ తీసుకుంటోంది. 2026 దీపావళికి పార్ట్ 1, 2027లో పార్ట్ 2 విడుదల చేయాలని ప్లాన్. ఇక యష్ రావణుడిగా ఎలాంటి పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తాడోనని కెజిఎఫ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Follow
Post a Comment