‘కేరాఫ్ కంచరపాలెం’తో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు వెంకటేష్ మహా గురించి అందరికి తెలిసిందే. KGF సినిమాపై అతను చేసిన నెగిటివ్ కామెంట్ అప్పట్లో బాగా కాంట్రవర్సీకి దారి తీసింది. ఇక గతంలో భావోద్వేగాలను ప్రధానంగా నడిపించిన కథలతో పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు సత్యదేవ్ హీరోగా రూపొందిస్తున్న సినిమాతో కాస్త హై బడ్జెట్‌కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ‘రావు బహదూర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
బ్రిటిష్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందట. లుక్, డిజైన్, క్యారెక్టర్ బిల్డింగ్ అన్నీ కొత్తగా ప్యాకేజ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు కమర్షియల్ హిట్స్ అందుకోని సత్యదేవ్ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టడం వెంకటేష్ మహా టీమ్ మీద ఎంత నమ్మకం ఉందో చెబుతోంది. గతంలో చేసిన కామెంట్స్‌కు విరుద్ధంగా కమర్షియల్ స్టైల్ సినిమాను డీల్ చేయడం కూడా మరో చర్చకు దారి తీస్తోంది. ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా, షూటింగ్ ఇప్పటికే మొదలైందన్న టాక్ ఉంది. మొత్తం సినిమా పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయాలన్న వ్యూహంతో టీమ్ ముందుకెళ్తోందట.
Follow
Post a Comment