ఒక్క హిట్ కొడితే చాలు… టాలీవుడ్‌లో డైరెక్టర్‌కు వరుస అవకాశాలు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సినిమా ఫ్లాప్ అయితేనే అవకాశాలు తగ్గిపోతున్నాయి. రెండోసారి కూడా ఫలితం రాకపోతే, ఆ డైరెక్టర్ కెరీర్ పూర్తిగా ఆగిపోయినట్టే. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు ప్రముఖ దర్శకులు ఇలా ఆగిపోయిన రైళ్లలాగే కనిపిస్తున్నారు.
శ్రీను వైట్ల, పరశురామ్, సురేందర్ రెడ్డి, గుణశేఖర్, కృష్ణ వంశీ, చంద్రశేఖర్ ఏలేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య, తరుణ్ భాస్కర్, దేవా కట్టా, ఎం.ఎస్. రాజు, మహి వి రాఘవ, సూర్య ప్రతాప్, వీరు పోట్ల, కిషోర్ తిరుమల, క్రాంతి మాధవ్, రాధాకృష్ణ కుమార్ వంటి దర్శకులు తమ తదుపరి సినిమాకు హీరోల కోసం ఎదురుచూస్తున్నారు. చాలామంది కొత్త కథలు రెడీ చేసుకున్నా, హీరోలు చూపించని ఆసక్తి వలన నిర్మాతలు ముందుకు రావడం లేదు. మరికొందరు రచన ప్రక్రియలోనే ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే టాలెంట్‌కు అవకాశాలంటే కాదు, ట్రాక్ రికార్డు, మార్కెట్ విలువ చూసే కాలం వచ్చేసింది. డైరెక్టర్లకు ఇది గట్టిపాఠమే అయినప్పటికీ, టాలీవుడ్ క్రియేటివిటీకి ఇది సంక్షోభంగా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Follow
Post a Comment