పుష్ప 2తో మాస్ మార్కెట్‌ను బాగా ఊపేసిన దర్శకుడు సుకుమార్, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఎలాగూ చరణ్ పెద్దితో బిజీగా ఉన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు కొంత గ్యాప్ లో కొంత సమయాన్ని అతడు విలువైన పని కోసం ఉపయోగిస్తున్నాడట. తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన శిష్యులకు అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాడు సుక్కు.
తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ తన బ్యానర్ ‘సుకుమార్ రైటింగ్స్’ ద్వారా నెక్స్ట్ జెట్ స్పీడ్ లో కనీసం ఆరుగురు శిష్యులను దర్శకులుగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా కథలు విన్న సుక్కు, వాటిలో కొన్ని మంచి కథలను ఫైన్ ట్యూన్ చేసి హీరోలతో డిస్కస్ చేస్తున్నాడట. ఈ క్రమంలో కొన్ని సినిమాలు త్వరలో పట్టాలెక్కే అవకాశముంది. ఈ కొత్త టాలెంట్ ప్రాజెక్టులకు ఫండింగ్ సమస్య లేకుండా ఉండేందుకు ఓ ప్రముఖ OTT సంస్థతో సుకుమార్ డీల్ ఫైనలైజ్ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాణ బాధ్యత అంతా OTT సంస్థ తీసుకుంటే, సుక్కు క్రియేటివ్ హెడ్‌గా మారి ప్రాజెక్టుల్ని గైడ్ చేయనున్నాడట. ఈయన శిష్యుల లోతైన కథలు, సుకుమార్ టచ్‌తో తెలుగులో కొత్త తరహా చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. తను మెగాఫోన్ పట్టకపోయినా... కొత్త దర్శకుల ద్వారా తన శైలి మరోసారి తెరపై కనిపించేలా చేస్తున్నాడు. మరి నెక్స్ట్ ఎంతమంది శిష్యులు డెబ్యూ చేస్తారో చూడాలి.
Follow
Post a Comment