ఎస్‌ఎస్‌ఎంబీ29 ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త ఇంట్రెస్టింగ్ బజ్ ఊపందుకుంటోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి ఇప్పుడు డైనోసార్ టచ్ వచ్చిందన్న టాక్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కథ అడవి నేపథ్యంలో సాగుతుందన్నది తెలిసిన విషయమే కానీ… అందులో డైనోసార్లు కూడా ఉంటాయన్న వార్తలతో అంచనాలు రెట్టింపయ్యాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ సినిమాలో మహేష్ బాబు డైనోసార్‌లను ఎదుర్కొనే 4-5 భారీ విజువల్ ఎపిసోడ్‌లు ఉంటాయట.
ఇప్పటికే వీఎఫ్‌ఎక్స్ టీమ్ స్పెషల్ గ్రాఫిక్స్‌పై పని ప్రారంభించిందని సమాచారం. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు సంబంధించాలా? లేక ఓ ఫిక్షనల్ వరల్డ్‌లో అడ్వెంచర్‌గా తీర్చిదిద్దుతున్నారా అన్నది మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ సినిమాతో ఇండియన్ సినిమాల్లోనే భారీ టెక్నికల్ ప్రయోగానికి రాజమౌళి తెర తీయబోతున్నారన్న నమ్మకం కలుగుతోంది. ప్రియాంక చోప్రా, ఫృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఓ ప్రముఖ స్టార్ హీరో మహేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. ఎమోషన్, యాక్షన్, అడ్వెంచర్ అన్నింటినీ మిళితం చేస్తూ 2026 చివర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.
Follow
Post a Comment