డ్రాగన్ కోసం మరో గ్లామరస్ బ్యూటీ



యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ఓ లాంగ్ యాక్షన్ షెడ్యూల్‌ను తెరకెక్కిస్తున్న సమయంలో, సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటలో శ్రుతిహాసన్ కనిపించబోతోందట.


సలార్ లో ఆమె ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను డ్రాగన్ లోనూ రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రశాంత్ నీల్ మరింతగా పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా పాటలు ఉంటాయని వినిపిస్తోంది. కథానాయికగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నా, ఆమె పాత్ర టిపికల్‌గా ఉండనుందని సమాచారం. గ్లామర్ డోస్ కోసం శ్రుతిని ఈ పాట కోసం తీసుకున్నారని సమాచారం. టాకీ పార్ట్ పూర్తయిన తర్వాతే ఈ పాటను భారీగా తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్‌కి ఈసారి డాన్స్ ఫుల్ స్వింగ్‌లో కనిపించబోతున్నాడన్న అంచనాలు అభిమానుల్లో జోరుగా ఉన్నాయి.

Post a Comment

Previous Post Next Post