రాజాసాబ్ టీజర్‌ ఓకే.. మరి సినిమా రిలీజ్ ఎప్పుడు?

 


ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజా సాబ్ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఆలస్యం అవుతున్నాయి. టీజర్ రెడీ అయిందన్న బజ్ ఉన్నా… ఫ్యాన్స్ మాత్రం అదే సరిపోదంటున్నారు. అసలైన రిలీజ్ డేట్ ఎప్పుడు? 2025లో రిలీజ్ అయితే కన్‌ఫర్మ్ చేసి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉండటంతో, రాగానే టీజర్ డబ్బింగ్ చెబుతారని టాక్. అయితే సినిమా మిగిలిన పాటల షూట్, టాకీ పార్ట్‌ కోసం మారుతీ డేట్స్ ప్లాన్ చేస్తున్నా… అసలు సమస్య ప్రభాస్ బిజీ షెడ్యూల్‌ వల్లే అంటున్నారు. ఆయన ప్రస్తుతం ఫౌజీ అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు.


దసరా సీజన్‌లో ఇప్పటికే కాంతారా 2, అఖండ 2, సంభరాల ఏటి గట్టు, ఇడ్లీ కడాయి వంటి సినిమాలు లైన్లో ఉండటంతో ఆ టైం అసాధ్యమే. దీపావళి టాలీవుడ్‌కి పెద్దగా లాభాల విండో కాదు. డిసెంబర్ మాత్రమే సరైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఒకవేళ సినిమా బాగుంటే సలార్ మోడల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. థమన్ సంగీతాన్ని మళ్లీ రీఫైన్ చేస్తుండగా… షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తేనే అభిమానుల ఆందోళన తీరుతుంది.

Post a Comment

Previous Post Next Post