ఇస్మార్ట్ శంకర్‌తో ఒక హిట్ అందుకున్న పూరి జగన్నాధ్‌కు ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల పరాజయం గట్టిగానే దెబ్బకొట్టింది. అయినా పూరి తన స్టైల్ మార్చలేదు. విమర్శలు పట్టించుకోకుండా తన తదుపరి సినిమాను విజయ్ సేతుపతితో ప్లాన్ చేశాడు. బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వేగంగా మొదలయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టబు, రాధిక ఆప్టే కీలక పాత్రల్లో కనిపించబోతుండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. పూరి ఈ సినిమాను కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇది ఆయన గత రికార్డైన బిజినెస్ మెన్ సినిమా కంటే కూడా వేగంగా. అప్పుడు మహేష్ బాబుతో తీసిన ఆ చిత్రం మూడు నెలల్లో పూర్తయి సంచలనం సృష్టించింది. ఇప్పుడు బెగ్గర్ ను రెండు షెడ్యూళ్లలో షూట్ చేసి తక్కువ బడ్జెట్‌లో, మంచి స్టాండర్డ్‌తో పూర్తి చేయాలనే ప్లాన్ పూరికి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాతో విజయ్ సేతుపతి కూడా డ్యూయల్ మార్కెట్‌లో ఓ మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి పూరి తన స్పీడ్ మేకింగ్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వస్తారా? అన్నది చూడాలి.
Follow
Post a Comment