పెద్ది కథ మొదట ఎవరికి చెప్పారు? బుచ్చిబాబు క్లారిటీ!


 ‘ఉప్పెన’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా తన రెండో సినిమా పెద్ది కోసం రామ్ చరణ్‌ను ఎంచుకోవడంపై చాలా చర్చ సాగింది. ఎందుకంటే గతంలో బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఈ కథ ఎప్పుడు ఎలా మొదలైందో అనే విషయంపై తాజాగా దర్శకుడే స్పందించి క్లారిటీ ఇచ్చారు.


‘‘ఈ కథను మొదట నా గురువు సుకుమార్‌కి వినిపించాను. ఆయనకు స్టోరీ బాగా నచ్చింది. వెంటనే చరణ్‌కి చెప్పు అన్నారు, అప్పుడే ఈ కథ రామ్ చరణ్‌దే అయిపోయింది’’ అని బుచ్చిబాబు తెలిపారు. దీంతో ఎన్టీఆర్‌కి చెప్పిన కథ ఇదే కాదన్న అనుమానాలు తొలగిపోయాయి. ఫస్ట్ షాట్ టీజర్ కూడా చరణ్‌కి బెస్ట్ ఫిట్‌గా ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీజర్ రిలీజ్ టైమ్‌కి తాను చరణ్ ఇంట్లోనే ఉన్నానని, మెగాస్టార్ చిరంజీవి కూడా టీజర్ చూసి ప్రశంసలు అందించారని బుచ్చిబాబు చెప్పడం ప్రత్యేకం. పెద్ది సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా, ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ మాస్ + గ్రామీణ క్యారెక్టర్‌లో కనిపించనున్న ఈ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

Previous Post Next Post