పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఓజీ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుజీత్ కొన్ని విప్లవాత్మక ప్రయోగాలకు సిద్ధమయ్యాడన్న టాక్ ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో ముఖ్యమైనది.. 30 ఏళ్ల వయసు గల పవన్‌ను తెరపై మళ్లీ చూపించాలన్న ఆలోచన. అందుకోసం సుజీత్, విఎఫ్‌ఎక్స్‌తో పాటు AI టెక్నాలజీకి కూడా గట్టిగానే వాడుతున్నట్లు సమాచారం.
బాలీవుడ్‌లో ఇప్పటికే అలాంటి ప్రయోగాలు జరిగినా, తెలుగులో మాత్రం సరిగా క్లిక్ కాలేదు. పవన్ అభిమానులు చాలా కాలంగా ‘తమ్ముడు’, ‘ఖుషి’ స్టైల్ యంగ్ లుక్ కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఆ కోణంలో అడుగుపెట్టడం సినిమాకే కాకుండా ఫ్యాన్స్‌కి ఒక సర్ప్రైజ్ కానుంది. ఓ మాస్ ఫైట్ సీన్‌లో పవన్‌కు యంగ్ లుక్‌ను చూపించేందుకు స్పెషల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సీన్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం. టెక్నికల్ టీమ్ హై రేంజ్ లో పని చేస్తుండటంతో, స్క్రీన్‌పై పవన్ మళ్లీ 30 ఏళ్ల యువకుడిగా మెరిసే అవకాశం ఉంది. ఇక మిగతా షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. థమన్ సంగీతంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారట. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, పార్ట్ 2లో కూడా అదే లుక్‌ను కొనసాగించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. మరి ఈ ఐడియా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Follow
Post a Comment