జైలర్ 2 తెలుగు రైట్స్.. మరీ ఎక్కువ చెబుతున్నారే..

 


సూపర్ స్టార్ రజనీకాంత్‌కి తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉందని జైలర్ మూవీ మరోసారి నిరూపించింది. కేవలం రూ.12 కోట్ల బిజినెస్‌తో తెలుగులోనే రూ.47 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు అదే జైలర్ సీక్వెల్‌కు సంబంధించి రైట్స్ కోసం భారీ పోటీ మొదలైందట. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం ఏకంగా రూ.60 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. కానీ ఇది హై రిస్క్ డీల్ అవుతుందా అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. నిర్మాతలు ఇంకా ఎక్కువ రేటు ఆశిస్తూ డీల్ ఫైనల్ చేసిందట.


ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చే వార్ 2 మూవీ కూడా ఆగస్ట్ 15న విడుదల కానుందని ప్రచారం. ఇదే టైంలో జైలర్ 2 రిలీజ్ అయితే బాక్సాఫీస్ పోటీ తప్పదు. జైలర్ 1 సింగిల్ రిలీజ్ కావడం వల్లే కలెక్షన్ల పండుగ చూసింది. ఇక ఈసారి అదే రిపీట్ అవుతుందా లేక భారీ మల్టీ స్టారర్ ముందు జైలర్ 2 నిలబడలేకపోతుందా? అన్నది రిలీజ్ సీజన్ ట్రెండ్‌పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ డీల్ ప్రాఫిట్ తెస్తుందా లేక డేంజర్ డీల్‌గా మిగిలిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Post a Comment

Previous Post Next Post