జాతీయ అవార్డు విజేత, టాలెంటెడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నెక్స్ట్ సారంగపాణి అనే సినిమాతో రానున్నారు. ఇక జటాయు అనే ప్రాజెక్ట్ గురించి గతంలో వినిపించిన టాక్‌కు ఆయన తాజాగా ముగింపు పలికారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాలనుకున్నారట. అయితే అది తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.
"సారంగపాణి కంటే ముందు ‘జటాయు’ సినిమా ప్లాన్ చేశాం. దిల్ రాజు గారు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. కానీ ఆయన నిర్మిస్తున్న గేమ్ చేంజర్ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని అర్థం కావడంతో, మధ్యలో ఇంకో సినిమా చేసుకోమన్నారంటూ" వివరించారు ఇంద్రగంటి. ఇటీవలి కాలంలో ఈ ప్రాజెక్ట్ కోసం మరో దర్శకుడిని రంగంలోకి దింపి ప్రభాస్‌తో జటాయు తీస్తారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంద్రగంటి ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. "జటాయు నా డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని నేనే తెరకెక్కిస్తాను. వేరొక దర్శకుడైతే నేను ఊహించిన స్థాయిలో తీసేయలేరు" అని తేల్చిచెప్పారు.
Follow
Post a Comment