దృశ్యం ఫ్రాంఛైజీకి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతగా క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. వెంకటేష్ నటించిన రెండు భాగాలూ భారీ విజయం సాధించాయి. "రాంబాబు" పాత్రలో ఆయన ఇచ్చిన నేచురల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్‌తో దృశ్యం 3 తెరకెక్కుతుండటంతో, తెలుగు వర్షన్‌పై ఆసక్తి తారాస్థాయికి చేరింది. అయితే ఈసారి మేకర్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెట్లను టార్గెట్ చేస్తూ, రీమేక్‌లు కాకుండా డబ్బింగ్ వెర్షన్లతోనే పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తెలుగులో వెంకటేష్ రీమేక్ లేకుండా మలయాళ వెర్షన్‌ను డబ్ చేసి విడుదల చేస్తే, అది మంచి నిర్ణయమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, మలయాళ వెర్షన్‌ను డబ్బింగ్ ద్వారా తెలుగులో విడుదల చేస్తే బిజినెస్ పరంగా 10 లేదా 15 కోట్లకు మించదు. అదే స్పెషల్ తెలుగు వెర్షన్‌ను వెంకటేష్‌తో చేస్తే కనీసం 50 కోట్ల బిజినెస్ జరగవచ్చని అంచనా. వెంకటేష్ ఫాలోయింగ్, తెలుగు ఆడియెన్స్ కనెక్ట్ అన్నీ కలిస్తే కమర్షియల్ విజయం ఖాయం అంటున్నారు. ప్రేక్షకులు ఇప్పటికే సోషల్ మీడియాలో స్పందిస్తూ.. దృశ్యం అంటే వెంకటేష్, ఆయన లేకుండా విడుదల చేసినా చూడం అనే కామెంట్లు పెడుతున్నారు. మేకర్స్ వ్యూహాత్మకంగా ఆలోచించకపోతే, ఇది 50 కోట్ల డీల్ పోయినట్లే అవుతుంది!
Follow
Post a Comment