ఒక సమయంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను శాసించిన నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. భారతీయుడు, ఖుషి లాంటి బ్లాక్‌బస్టర్‌లతో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. కానీ కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమాల వరుస పరాజయాలు రత్నాన్ని వెనక్కి నెట్టాయి. అప్పటి నుంచి పెద్దగా సౌండ్ లేకుండా గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తర్వాత రత్నం పునరాగమనం చేసిన సినిమా హరిహర వీరమల్లు.
పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. కానీ పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్, ఇతర సినిమాల డిలే కారణంగా ‘వీరమల్లు’ వాయిదా పడుతూనే ఉంది. తాజాగా మే 9న రిలీజ్ చేస్తామన్న ప్లాన్ కూడా వాయిదా పడినట్టు టాక్. అధికారికంగా ప్రకటించకపోయినా, పవన్ షూటింగ్‌కు ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో టీమ్ గందరగోళంలో ఉంది. సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. వడ్డీల భారం భారంగా మారింది. అందులోనూ దర్శకుడు మారిన విధానం వలన క్రేజ్ మరింత పడిపోయింది. ఇప్పటికే ఉన్న నష్టాన్ని కొంతైనా తగ్గించుకోవడం రత్నానికి సవాలుగా మారింది. ఈ సినిమా వాయిదాలతో నిర్మాత ఏఎం రత్నం మళ్లీ ఒకసారి తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో పడ్డారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Follow
Post a Comment