మెగాస్టార్ చిరంజీవి మీద ప్రేమను ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పుకున్న యువ దర్శకుడు బాబీ కోల్లి, ‘వాల్తేరు వీరయ్య’తో మెగా ఫ్యాన్స్‌కి బ్లాక్‌బస్టర్ బహుమతినిచ్చాడు. తర్వాత బాలకృష్ణతో ‘డాకూ మహారాజ్’ తీసి డీసెంట్ హిట్ అందుకున్న బాబీ, ఇప్పుడు మళ్లీ చిరుతో కలిసి భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మాస్ ఎంటర్టైనర్‌కి సంబంధించి బాబీ-చిరు కాంబోను నిర్మించేందుకు టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు పరిశీలించినప్పటికీ, ప్రస్తుతంగా వాళ్లందరూ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నిర్మాత ఎంపిక కొంచెం ఆలస్యం అవుతోంది. చిరంజీవి స్వయంగా సరైన నిర్మాణ సంస్థను తాను ఫైనలైజ్ చేస్తానని బాబీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ ఆకాశాన్ని తాకనుంది. చిరంజీవి రెమ్యునరేషన్ రూ.75 కోట్లు కాగా, ఇతర నటీమణుల పారితోషికాలతో కలిపి మరో రూ.25 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా మేకింగ్‌కి రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా ఇది రూ.200 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని ఫిలింనగర్ వర్గాల టాక్. ఇప్పుడు మెగాస్టార్‌కి సరిపోయే స్థాయిలో బడ్జెట్ హ్యాండిల్ చేయగలిగే నిర్మాత కోసం హంట్ కొనసాగుతోంది.
Follow
Post a Comment