విశ్వంభర గ్రాఫిక్స్ కోసం రూ.75 కోట్లు.. టోటల్ బడ్జెట్ ఎంత?

 


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను రూ.80 కోట్లలోపే కంప్లీట్ చేయాలన్నది మేకర్స్ ప్రాథమిక లెక్క. అయితే కథ, స్కేలు పెరగడంతో బడ్జెట్ కూడా రూ.100 కోట్లకు చేరింది. అయినా చాలు అనుకున్నారు. కానీ గ్లింప్స్ రిలీజైన తర్వాత వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వల్ల గ్రాఫిక్స్‌ పైనే ఫోకస్ పెంచారు.


ఇప్పుడున్న టాక్ ప్రకారం, కేవలం గ్రాఫిక్స్ కోసం రూ.75 కోట్లను ఖర్చు చేస్తోందట చిత్రబృందం. ఇది ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ విఎఫెక్స్ బడ్జెట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. అసలు ప్లాన్‌లో గ్రాఫిక్స్ కోసం రూ.25 కోట్లు మాత్రమే కేటాయించినప్పటికి.. ఇప్పుడు అది ట్రిపుల్ అవడం గమనార్హం. హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం తీసుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు భారీ విజువల్ ట్రీట్‌గా మలచాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే, విశ్వంభర ఫైనల్ బడ్జెట్ రూ.150 కోట్లు దాటి ఉంటుందని సినీ వర్గాల్లో గట్టిగానే టాక్ నడుస్తోంది. విజువల్స్‌ విషయంలో రాజీ పడకుండా… అందులోనూ మెగాస్టార్ పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తుండడంతో, మేకర్స్ ఈ భారీ రిస్క్ రెడీ అయినట్టు కనిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post