అఖండ 2: నిజంగా బడ్జెట్ అంత పెరిగిందా?

 


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇంటర్వెల్ పార్ట్ షూట్ పూర్తి చేసుకుని, వేగంగా మిగతా భాగాన్ని పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లను టచ్ అవుతుందన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. బాలయ్య సాధారణంగా బడ్జెట్ విషయంలో ఎక్స్‌పెరిమెంట్లకు దూరంగా ఉండే హీరో. కానీ ఈసారి బోయపాటి విజన్‌కు పూర్తి సహకారం ఇస్తూ భారీగా ఖర్చు చేయిస్తున్నారట.


ముఖ్యంగా గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, విదేశీ షెడ్యూల్స్‌కి మంచి బడ్జెట్ కేటాయించారని సమాచారం. హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతోనే స్కేలు పెంచారని టాక్. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మధ్య డిజిటల్ హక్కుల కోసం పోటీ జరుగుతోంది. ఈ నెలలోనే నిర్మాతలు తుది నిర్ణయం తీసుకోనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. దసరాకు సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఫాలోయింగ్‌తో పాటు బోయపాటి మాస్ మేకింగ్ కలిసొస్తే… బడ్జెట్ ఎంతైనా రాబట్టే అవకాశమే ఉంటుంది. కానీ 200 కోట్లు వాస్తవమేనా? అనే క్లారిటీ మాత్రం త్వరలోనే రానుంది.

Post a Comment

Previous Post Next Post