కథ:
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవస్థలో కీలక స్థానాన్ని దక్కించుకున్న పుష్ప (అల్లు అర్జున్) పోరాటం, ప్రతీకారం ఈ సీక్వెల్‌కి ప్రధాన నేపథ్యం. పుష్ప గతంలో తనకు ఎదురుగా నిలిచిన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్(ఫాహద్ ఫాజిల్)ను అవమానించడంతో షెకావత్ పగతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సిండికేట్ అంతా కలిసి పుష్పను షెకావత్ వద్ద క్షమాపణ చెప్పించాలని ఒత్తిడి చేస్తుంది. కానీ పుష్ప ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడన్నది ఆసక్తికరం. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద డీల్ చేసే ప్రయత్నంలో పుష్ప, షెకావత్ మధ్య పోరాటం మరింత ఉత్కంఠతో సాగుతుంది. పుష్ప తన వ్యాపారాన్ని రక్షించుకోవడం, అతని ప్రతిఘటించే ఆటతీరు ఏ విధంగా ఉంటుంది అనేది అసలు కథ.
విశ్లేషణ:
విశ్లేషణ:
‘పుష్ప: ది రైజ్’ ముగిసినపుడు పుష్ప డాన్ స్థాయికి ఎదిగిపోతాడు. సీక్వెల్‌లో ఈ స్థాయి నుంచే కథ మొదలవడం, అది మరింత ఎత్తుకు తీసుకెళ్లడం సుకుమార్ చేసిన మొదటి ప్రయత్నం. కథలో మలుపులు కొంచెం తగ్గినా, సీన్లలో ఎలివేషన్, యాక్షన్ దృశ్యాలతో ఆసక్తిని కట్టిపడేశారు. ‘పుష్ప 2’లో కథ ప్రధానంగా పుష్ప-షెకావత్ మధ్య ప్రతీకారం, వ్యూహాలు చుట్టూ తిరుగుతుంది. మాస్ ఎపిసోడ్లతో, ఊహించని ట్విస్టులతో కథనాన్ని ఉత్కంఠభరితంగా నడిపించారు. జాతర ఎపిసోడ్, కొన్ని కీలక ఘట్టాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ పై హైప్ పెంచేలా రాసుకున్న సీన్లు బాగానే పేలాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో తన కెరీర్‌లో బలమైన పాత్రను మరోసారి ప్రదర్శించాడు. ఇక డైలాగ్స్ కూడా కంటెంట్ కు తగ్గట్లే ఉన్నాయి. ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్...ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. అంటూ చెప్పిన డైలాగ్ కాస్త కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంది. ఇక పుష్ప పాత్రకు బన్నీ చూపించిన యాటిట్యూడ్, ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేసాయి. ప్రత్యేకించి జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నటన పీక్స్‌లో ఉంది. రష్మిక శ్రీవల్లి పాత్రలో ఈసారి మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఫాహద్ ఫాజిల్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో బాగా ఆకట్టుకున్నారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ "కిసిక్" యూత్‌ను ఆకర్షించేలా ఉంది.
దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్‌ల హై తగ్గకుండా చూసాడు. పాటలు విన్నపుడు, తెరపై చూసినప్పుడు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ గా అనిపించినా మళ్ళీ సుక్కు ఎలివేషన్స్ తో హైప్ ఇచ్చాడు. కొన్ని పాత్రలను ఇంకా బలంగా రాసికోవాల్సింది అనిపిస్తుంది. ప్రధానంగా కథ కంటే హీరో ఎలివేషన్స్ ఎక్కువగా డామినేట్ చేశాయి. దర్శకుడు క్యారెక్టర్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో కూడా కాస్త అసంతృప్తి కలుగుతుంది. ఇక కూబా ఫొటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకు మరో బలం. జాతర ఎపిసోడ్‌లో ఆర్ట్ డైరెక్షన్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి.
ఫైనల్ గా ‘పుష్ప 2: ది రూల్’ కథ పరంగా కొత్తగా లేకున్నా, మాస్ ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్, ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది.
పాజిటివ్ పాయింట్స్:
👉అల్లు అర్జున్ నటన.
👉ఎలివేషన్ సీన్స్.
👉బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
👉యాక్షన్ ఘట్టాలు.
నెగెటివ్ పాయింట్స్:
👉కథలో కొత్తదనం లేకపోవడం
👉క్లైమాక్స్‌లో కొంత అసంతృప్తి.
రేటింగ్: 3/5
Follow
Follow
Post a Comment