‘పుష్ప: ది రూల్’ విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినప్పటికీ, సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ముందుగా అనేక రకాల గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సంతృప్తిగా లేకపోవడంతో దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.
తమన్, అజనీష్ లోక్‌నాథ్, సామ్ సీఎస్ ముగ్గురు తమకిచ్చిన బాధ్యతలను పూర్తి చేసి ట్రాక్స్ అందజేశారు. అయితే, సుకుమార్‌తో పాటు బన్నీ కూడా తమన్ వర్క్‌కి సంతృప్తి చెందకపోవడంతో, ఆ ట్రాక్స్ పూర్తిగా పక్కనపెట్టారు. అజనీష్ వర్క్ కొంత మెప్పించినప్పటికీ, సినిమా మొత్తం అందుకోవడానికి సరిపోలలేదట. ఇక చివరకు, సామ్ సీఎస్ కంపోజ్ చేసిన BGM మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఉపయోగించారు.
సామ్ వర్క్ ప్రధానంగా పోలీస్ స్టేషన్, జాతర ఎపిసోడ్‌లలో వినిపించింది. ఇక సినిమా టైటిల్స్‌లో ప్రధాన సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పేరునే ఉంచగా, సామ్ పేరు అదనపు సంగీతం విభాగంలో మాత్రమే వచ్చింది. ఇక ముగ్గురు సంగీత దర్శకులకు తలో కోటి రూపాయలు చెల్లించడం విశేషం. మొత్తం రూ.3 కోట్లు ఖర్చు చేసిన మైత్రి మూవీ మేకర్స్, చివరికి దేవిశ్రీ ప్రసాద్ వర్క్‌నే ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఈ తరహా మార్పుల వలన దేవి, తమన్ మధ్య ఇప్పుడు మరింత గ్యాప్ ఏర్పడిందని పరిశ్రమలో చర్చలు నడుస్తున్నాయి.
Follow
Follow
Post a Comment