RC16: రెహమాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


ఎ.ఆర్. రెహమాన్ బ్రాండ్ సౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ సినిమా సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన ఆయన పాటలు, బాణీలు భాషలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నాయి. తెలుగులో కూడా ఆయనకు ఉన్న క్రేజ్ అనిర్వచనీయంగా ఉంది. అయితే, తెలుగులో రెహమాన్ కేవలం ముగ్గురు స్థానిక దర్శకులతో మాత్రమే పని చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

కెరీర్ ప్రారంభంలో ఎ.కోదండరామిరెడ్డి (నిప్పురవ్వ), కె. మురళి మోహన్ రావు (సూపర్ పోలీస్), బి. గోపాల్ (గ్యాంగ్ మాస్టర్) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా తమిళ దర్శకులతో తెలుగులో పని చేశారు. రెహమాన్ తెలుగులో చేసిన నీ మనసు నాకు తెలుసు, ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో ఉన్నాయి. ఈ సినిమాల దర్శకులు జ్యోతి కృష్ణ, గౌతం మీనన్ ఇద్దరు తమిళవారే కావడం విశేషం.

ఇప్పుడు, దాదాపు 30 ఏళ్ల తర్వాత, ఒక తెలుగు దర్శకుడు బుచ్చిబాబు రెహమాన్ తో చేతులు కలపడం విశేషం. రామ్ చరణ్ 16 సినిమాకి రెహమాన్ సంగీతం అందించనుండడంటీజేపీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఇక ఈ సినిమాకు అతను దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. బుచ్చిబాబు తన మొదటి సినిమాకు దేవిశ్రీప్రసాద్ ను సెలెక్ట్ చేసుకున్నప్పటికి ఈసారి రెహమాన్ దగ్గరకు వెళ్లారు అంటే మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post