OG: క్లైమాక్స్ కోసమే మరో స్టార్ హీరోనా?


పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమా మీద ఫ్యాన్స్ లో ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. హరిహర వీరమల్లూ ముందుగా రిలీజ్ కావాల్సినప్పటికీ, ఫ్యాన్స్ ఎక్కువగా ఓజి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ స్టైలిష్ అవతారంతో కనిపించనున్నారని తెలుస్తోంది.

తాజాగా ఓజి సినిమాలో కీలక క్యామియో గురించి కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. గతంలో ప్రభాస్ లేదా నాని ఈ పాత్ర చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ స్పెషల్ రోల్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌స్టర్ కథలో చరణ్ పాత్ర క్లైమాక్స్ లో ఉంటుందని టాక్. చాలా తక్కువ నిడివి అయినప్పటికీ, అది పవన్ కళ్యాణ్ పాత్రకు మరింత మాస్ ఎలివేషన్ అందించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ ఇప్పటికే కొన్ని నెలల క్రితం ఈ పాత్ర గురించి చర్చించినట్లు టాక్, తక్కువ కాల్ షీట్ ఉన్న కారణంగా ఆ ప్రత్యేక ఘట్టంలో భాగమవుతానని సుజిత్‌కి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ వార్త ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహంలో ముంచెత్తుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, బాబాయ్-అబ్బాయి స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ఊహించని రేంజ్ లో రికార్డుల మోత మోగిస్తుందని చెప్పవచ్చు. ఇక సినిమాను 2025లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా, సంక్రాంతి సందర్భంగా టీజర్ లేదా పాట రూపంలో కొత్త అప్డేట్ రావచ్చని సమాచారం.

Post a Comment

Previous Post Next Post