పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ అంచనాలు తెచ్చుకున్న పుష్ప 2 రిలీజ్ దగ్గరపడుతున్న వేళ, ఫ్యాన్స్ లో మరో ఆసక్తి కలిగించిన అంశం పుష్ప 3. ఇప్పటికే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ 120 కోట్ల మార్క్ దాటిందని టాక్, విడుదలకు ముందు లెక్క 200 కోట్లకు పైగా చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీకి హిట్ టాక్ వస్తే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఖాయమని చెబుతున్నారు.
పుష్ప ఫ్రాంచైజ్ మూడో భాగం గురించి గతంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ పరోక్షంగా ప్రస్తావించారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్, “ఇంకా మూడేళ్ల టైమ్ నాకిస్తే, మూడో భాగం చేస్తాను” అని అనడంతో, ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా పుష్ప 3 ర్యాంపేజ్ అనే టైటిల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
సుకుమార్ ఇప్పటికే పుష్ప 2 క్లైమాక్స్ లో మూడో పార్ట్ కు ముడిపెడుతున్న పెద్ద ట్విస్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. పుష్పరాజ్ కథకు మరింత మాస్ ఎలిమెంట్ జోడించేలా, భారీ స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అనుకుంటున్నారు. హాలీవుడ్ లెవెల్ సౌండ్ మిక్సింగ్ తో ఆస్కార్ విన్నర్ రసూల్ పోకుట్టి టీమ్ చేసిన పని, సినిమాకు ఇంకో లెవెల్ లో బజ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 విజయాన్ని బట్టి పుష్ప 3 అధికారిక ప్రకటన రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Follow
Follow
Post a Comment