పుష్ప 2: ఈవెంట్ కోసం ఇంత మంది పోలీసులా.. నెవ్వర్ బిఫోర్!


పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 ప్రమోషన్స్ కు అల్లు అర్జున్ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ గ్రాండ్ గా నిర్వహించిన టీమ్, నేడు హైదరాబాద్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో రాత్రి జరగనున్న పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ కు భారీ క్రౌడ్ వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ పోలీసు శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. 

సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకు 200-500 మంది పోలీసులు బందోబస్తు కల్పిస్తారు. కానీ పుష్ప 2 హైప్ దృష్ట్యా ఈసారి మొత్తం 1000 మంది పోలీసులు విధుల్లో చేరారని సమాచారం. ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడంతో పాటు, గ్రౌండ్ చుట్టూ పక్క ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ ప్రదేశం మొత్తం పోలీసుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. భారీగా అభిమానులు రాబోతుండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ బందోబస్తు పై అభిమానులు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. "1000 మంది పోలీసులతో బందోబస్తు అంటే ఇది పుష్ప హవా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, ఈవెంట్ ప్రాంగణంలో విధుల్లో చేరుతున్న పోలీసుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post