'క'తో ఫార్ములా సక్సెస్.. ఈ కథలతో బాక్సాఫీస్ హిట్టు


తాజాగా ప్రేక్షకులను ఊరించే సక్సెస్ ఫార్ములా పల్లెటూరి మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్లు అన్నమాట. ట్విస్టులతో సాగే ఈ కథలు ప్రేక్షకుల్ని పట్టేయడం విశేషం. ఈ జానర్‌లో సినిమాలు తీస్తూ సక్సెస్ రేటును మెరుగుపర్చడమే గాక, దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఇటీవల వచ్చోన సినిమాలలో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ కూడా అదే ఫార్మాట్ లో వచ్చి కాసుల వర్షం కురిపించింది. ఒక మారుమూల అటవీ ప్రాంతంలో నడిచే కథ, దర్శకుడి మేకింగ్ అందరినీ ఆకట్టుకుంది. అంతుచిక్కని మలుపులతో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 

అదే విధంగా, స్టార్ క్యాస్టింగ్ లేకుండా రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ కూడా అనూహ్యంగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు, పల్లెటూరి నేపథ్యంతో వచ్చిన అజయ్ భూపతి ‘మంగళవారం’తో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘మాసూద’ వంటి చిత్రం కూడా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో కథనాన్ని సాగేలా చేస్తూ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ‘క’ కూడా ఇదే కోవలోకి చేరింది. క్రిష్ణగిరి అనే ఊరిని చుట్టూ అల్లిన క్రైమ్ థ్రిల్లర్, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ఇక ఎనభై దశకంలో వంశీ తీసిన ‘అన్వేషణ’ సహా ఎన్నో సినిమాలు, అడవి, పల్లెటూరి నేపథ్యంతో సక్సెస్ సాధించాయి. మొత్తం మీద పల్లెటూరిలో ఉండే మిస్టరీలు, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తూ.. హిట్ ఫార్ములాగా మారుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post