విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో కొత్త తరహా కథల కోసం ప్రయత్నాలు చేస్తూ, యువ దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడితో చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 జనవరి 14న విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్ తాజాగా యంగ్ డైరెక్టర్ విమల్ కృష్ణ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
సిద్దు జొన్నలగడ్డతో డీజే టిల్లు ద్వారా సూపర్ హిట్ అందుకున్న విమల్, కొంతకాలం గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి మెగా ఛాన్స్ దక్కించుకున్నాడు. వెంకటేష్‌తో ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దాలని విమల్ కృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు సైంధవ్ వంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయిన వెంకటేష్, తన అభిమానుల కోసం మళ్ళీ కామెడీ ప్రధానంగా ఉండే కథలపై దృష్టి పెట్టారు. ఈ నేపధ్యంలో విమల్ చెప్పిన కథలో మంచి వినోదం, కొత్త తరహా కథనంతో పాటు, పాత్రలో ప్రత్యేకత ఉండడంతో వెంటనే ఒప్పుకున్నారట. ఇక ఈ కాంబో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Follow
Post a Comment