పాన్ ఇండియా సినిమా పుష్ప 2: ది రూల్ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ అంచనాల వెనుక సుకుమార్ క్రియేటివిటీ ప్రధాన కారణం. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ పూర్తవడంలో సుకుమార్‌కి అజ్ఞాత సహాయ దర్శకుల భాగస్వామ్యం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రం, డిసెంబర్ 5కి వాయిదా పడింది. చివరి వరకు షూటింగ్ కొనసాగడంతో సుకుమార్ సెట్స్‌పై పూర్తి సమయం గడపలేకపోయారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరగాల్సి రావడంతో, ప్యాచ్ వర్క్ సమయంలో సుకుమార్ బదులు సహాయ దర్శకులు సినిమా పనులు పూర్తిచేయడం జరిగింది. సహాయ దర్శకులు సెట్లో ఉన్నప్పటికీ, సుకుమార్ ప్రతి ప్లాన్ కు తన ఆధ్వర్యంలో చూసి ఆమోదముద్ర వేస్తున్నారని సమాచారం. దాదాపు 10 మంది సహాయక దర్శకులు ఉండగా పలు కీలక సీన్స్ ను ముగ్గురు దర్శకులకు హ్యాండ్ ఓవర్ చేశారు.
లాస్ట్ మినట్ లో తన అసిస్టెంట్ల మీదే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతున్నా, సుకుమార్ ఆవుట్‌పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపారని తెలుస్తోంది. అందుకే ప్రోమోషన్ ఈవెంట్స్‌కు కూడా రాలేదు. ఇప్పటివరకు సుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని కార్యక్రమాలు సినిమాపై అంచనాలను పెంచాయి. త్వరగా సినిమా పూర్తి చేయడమే కాకుండా, క్వాలిటీని మరింత పెంచాలన్న తపనతో సుకుమార్ సమయం వినియోగించుకుంటున్నాడు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow
Follow
Post a Comment