మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29పై రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శోభు యార్లగడ్డ వ్యవహరించనున్నారు. బాహుబలి సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ వ్యూహాలతో తనను తాను నిరూపించుకున్న శోభు, ఈ ప్రాజెక్ట్‌కు కీలకంగా మారనున్నారు.
SSMB29 కోసం దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్‌ను ఖర్చు చేస్తారని టాక్. అంతటి భారీ ప్రాజెక్ట్‌ను మేనేజ్ చేయడానికి శోభు అనుభవం అవసరమని రాజమౌళి భావించారని తెలుస్తోంది. రాజమౌళి మర్యాద రామన్న బాహుబలి సినిమాలకు ఆయనే నిర్మాత. ఇక RRR ఆస్కార్ కు వెళ్లే క్రమంలో శోభు బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో సినిమా గుర్తింపు పొందేలా ప్లాన్ చేయడంలో శోభు పాత్ర కీలకమని రాజమౌళికి బాగా తెలుసు. అందుకే ఆయన్ను స్వయంగా ప్రాజెక్టులోకి లాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను KL నారాయణ ‘జై దుర్గా ఆర్ట్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఆఫ్రికా అడవుల్లో సెటప్ చేయబడుతున్న ఈ చిత్రం, యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ఎక్స్ పనులతో గ్లోబల్ ఆడియన్స్‌కు అద్భుతమైన అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, శోభు వంటివారు ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం మహేష్ కెరీర్‌కే కాకుండా ఇండియన్ సినిమా స్థాయికి మరో బిగ్ ప్రాజెక్టు అవుతుందని అనిపిస్తోంది.
Follow
Follow
Post a Comment