సంక్రాంతి క్లాష్.. నష్టాలు రాకుండా దిల్ రాజు ప్లాన్?


సంక్రాంతి పండగ టైమ్ లో ప్రతి ఏటా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు పోటీపడతాయి. ఇక ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రూపంలో ఎక్కడో ఒకటి దిల్ రాజు హవా కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి సంక్రాంతి రేసులో మూడు పెద్ద సినిమాల్లో దిల్ రాజు చురుగ్గా కనిపిస్తున్నాడు. ముందుగా ఆయన నిర్మించిన గేమ్ చేంజర్ జనవరి 10న భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. 

దీని తర్వాత జనవరి 14న దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకులను అలరించబోతోంది. అయితే వీటితో పాటు మరో విశేషం ఏమిటంటే, డాకు మహారాజ్ రిలీజ్ హక్కులను నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు తీసుకున్నారు. డాకు మహారాజ్ హారిక హాసిని మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం. వీరి బలమైన సంబంధాల కారణంగా ఈ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మూడు సినిమాల థియేట్రికల్ వాల్యూ దాదాపు 150 నుంచి 200 కోట్లు ఉంటుందట.

సంక్రాంతి రేసులో థియేటర్స్ విషయంలో ఎలాంటి గోడవ లేకుండా దిల్ రాజు మ్యానేజ్ చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ తేడా కొట్టినా థియేట్రికల్ గా వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు ఆ నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. టాక్ అటు ఇటుగా ఉన్నా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. మరి ఈ మూడు సినిమాల విజయాలు దిల్ రాజు క్యాలిక్యులేషన్‌ను ఎంతవరకు సాకారం చేస్తాయో చూడాల్సి ఉంది.

Post a Comment

Previous Post Next Post