యంగ్ హీరో సందీప్ కిషన్ తెలుగు, తమిళ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. తాజాగా, కోలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించబోతున్న డెబ్యూ మూవీ కావడం విశేషం. తన తండ్రి మార్గాన్ని అనుసరించి హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకున్న జాసన్ సంజయ్, ఊహించని విధంగా డైరెక్షన్ వైపు అడుగుపెట్టాడు.
లైకా ప్రొడక్షన్స్ జాసన్ సంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. చిత్రానికి హీరోగా సందీప్ కిషన్‌ని ఫైనల్ చేయడం, ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచింది. సందీప్ కిషన్‌కు ఈ సినిమా అతని కోలీవుడ్ కెరియర్‌లో కీలక మలుపుగా మారబోతోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌ను ఎంపిక చేశారు. దళపతి విజయ్‌కు ఎన్నో మ్యూజికల్ హిట్ ఆల్బమ్‌లు ఇచ్చిన థమన్, ఆయన కొడుకు సినిమాకు ఎలా న్యాయం చేస్తాడన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఉంది. ఇక సందీప్ కిషన్, ప్రస్తుతం తన తాజా చిత్రం మజాకా రిలీజ్ కోసం సిద్దమవుతుండగా, ఈ కోలీవుడ్ ప్రాజెక్ట్ ద్వారా తమిళ పరిశ్రమలో మరింత క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి అతను లక్కు ఎలా ఉంటుందో చూడాలి.
Follow
Post a Comment