యానిమల్ తర్వాత రష్మిక మందన్న తెరపై కనిపించకపోయినా, సినిమాల గ్యాప్ వల్ల కాకుండా షూటింగ్ ఆలస్యం వల్లే ఆమె బిగ్ స్క్రీన్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఈ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు కేవలం 10 నెలల్లోనే 6 పెద్ద సినిమాలతో రష్మిక తిరిగి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రథమంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2: ది రూల్’లో శ్రీవల్లి పాత్రలో రష్మిక మరింత వైవిధ్యంగా కనిపించనుంది. మొదటి భాగం కన్నా ఈ సారి సుకుమార్ ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సమాచారం.
దీని వెంటనే రష్మిక విక్కీ కౌశల్ సరసన నటించిన బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా ‘చావా’ రానుంది. ఈ సినిమాలో శంభాజీ జీవితం ఆధారంగా రష్మిక ఒక పవర్ఫుల్ రోల్లో దర్శనమివ్వనుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ సరసన ‘సికందర్’లో తొలిసారి జోడిగా కనిపించనుంది రష్మిక. ఈద్‌కు ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
తదుపరి నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కుబేర’ సినిమాలో రష్మికకు ఒక ప్రత్యేక పాత్రను ఇచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పాత్రపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అంతేకాకుండా, మరో హారర్ డ్రామా ‘తమా’లోనూ రష్మికకు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విధంగా 2025 అక్టోబర్ నాటికి అమ్మడు గ్యాప్ లేకుండా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.
Follow
Follow
Post a Comment