ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కొత్త ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యారు. రాపో 22 పేరుతో రూపొందనున్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఘన విజయాన్ని సాధించిన దర్శకుడు మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం అవుతోంది. కథ విభిన్నంగా ఉండి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ సినిమాలో రామ్ మాత్రమే కాకుండా, మరో హీరోకు కూడా కీలక పాత్ర ఉండనుంది. ఆ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ రోల్ కోసం దర్శకుడు మహేష్ బాబు బాలీవుడ్ లేదా కోలీవుడ్ దిగ్గజాలను లక్ష్యంగా పెట్టుకున్నారట. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి పెద్ద పేర్లు వినిపిస్తున్నా, వీరితో డేట్స్ సమస్య ఉండే అవకాశముందని సమాచారం. దీంతో బాలకృష్ణ పేరు కూడా చర్చలోకి వచ్చిందట. అయితే ఈ పాత్రకు ఫైనల్ గా ఎవరిని తీసుకుంటారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రామ్ గతంలో మసాలా మల్టీస్టారర్‌లో వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా, బాక్సాఫీస్ ఫలితాలు నిరాశపరిచాయి. వరుస ఫ్లాపుల తర్వాత రామ్‌కి బ్లాక్ బస్టర్ సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభిన్న కథతో పాటు మల్టీస్టారర్ ఫార్ములా ఫలితం అందిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను 2025 వేసవి నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యం జరిగితే దసరాకు తీసుకురావాలని యోచనలో ఉన్నారు.
Follow
Follow
Post a Comment