అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పుష్ప 2: ది రూల్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ క్రేజ్‌ను మరింత పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల పెంపు చర్చలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఎలాగూ నచ్చిన ధరలే వస్తాయి.
అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద సినిమాలకు సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను గరిష్ఠంగా 250 రూపాయల వరకు పెంచిన ప్రభుత్వం, ఈసారి పుష్ప కు ఎక్కువ స్థాయిలోనే వెసులుబాటు కలిగించే అవకాశం ఉన్నట్టు టాక్. సింగిల్ స్క్రీన్ పై అత్యధికంగా 300 రూపాయలు ఉండేలా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నారని తెలుస్తోంది.
అయితే పుష్ప 2కి ఈ స్థాయి రేటుకు గవర్నమెంట్ అనుమతిస్తుందా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుష్ప 1 సమయంలో వైసీపీ ప్రభుత్వ అండ లేకపోవడం వల్ల మైత్రి మూవీ మేకర్స్ కొంత నష్టపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త కూటమి ప్రభుత్వం పెద్ద సినిమాలకు సపోర్ట్ ఇస్తూ వస్తోంది. కల్కి దేవర లాంటి సినిమాలకు ఫుల్ సపోర్ట్ చూపిన ప్రభుత్వం, పుష్ప 2కి కూడా అదే తరహా సహకారం అందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో టికెట్ రేట్లు సాధారణంగా అధికంగానే ఉంటాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా టికెట్ రేట్లు పెంచడంపై మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కానీ 300 రూపాయల రేటును అనుమతిస్తే, మొదటి వీకెండ్ కలెక్షన్లపై ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ధరల పెంపు ప్రేక్షకులపై ఆర్థిక భారం పెడుతుందా లేదా అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
Follow
Follow
Post a Comment