పుష్ప 2: టిక్కెట్ రేట్లు ఎంత పెరుగుతాయంటే..?


ఇంకా ఆరు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రిలీజ్‌ అవుతుండటంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం మొదలవుతోంది. దీపావళి తర్వాత ఖాళీగా ఉన్న థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులతో వెలిగిపోనున్నాయి. పుష్ప రాజ్ సునామీకి థియేటర్ సిబ్బందీ క్షణం తీరిక లేకుండా బిజీ కానున్నారు. రేపటినుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్‌ ప్రారంభమవుతాయనే సమాచారం ట్రేడ్‌లో హడావుడి రేపుతోంది.

ఇప్పుడు అందరి దృష్టి టికెట్ ధరల పెంపు ఎంతవరకు ఉండబోతోందన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పరిశ్రమ కోరినవిధంగా అనుమతులు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పరిశ్రమకు మద్దతు ఉండటంతో రేట్ల పెంపు కచ్చితంగా అమలవుతుందని భావిస్తున్నారు. దేవర సినిమా కంటే పుష్ప 2కి మరింతగా టికెట్ ధరలు పెరగవచ్చని అంచనా. మల్టీప్లెక్స్ టికెట్ రేటు 400 వరకు ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణలో దేవరకిచ్చిన స్థాయి హైక్‌నే కొనసాగించే అవకాశముంది. ప్రీమియర్ షోల డిమాండ్ విపరీతంగా ఉంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుఝామున వరకూ షోల కోసం బుకింగ్స్‌పై జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బిసి సెంటర్లలో కొన్ని థియేటర్లు 750 రూపాయల వరకు టికెట్ రేట్లను నిర్ధేశించారని సమాచారం. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా విడుదలకు ముందు రోజునే టికెట్లు దొరికే అవకాశం తక్కువ. సాంకేతిక సమస్యలు పక్కన పెడితే, బుక్ మై షో వంటి యాప్స్‌పై భారీ ట్రాఫిక్ ఉండబోతోందని అంటున్నారు.

Post a Comment

Previous Post Next Post