పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పుష్ప 2: ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల్లు అర్జున్ అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే పథకం వేస్తున్నట్లు టాక్. మొదటి రోజు థియేటర్ టికెట్లను వేలం ద్వారా విక్రయించే ఆలోచనపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ విధానం ప్రకారం, ప్రతి థియేటర్‌లో మొదటి టికెట్‌ను వేలం ద్వారా విక్రయిస్తారు. టికెట్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికి మొదటి టికెట్ అందజేస్తారు. అయితే, ఈ ప్లాన్ అమలు చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వమే నియంత్రిస్తుంది కావున ఈ విధానం అమలు చేసేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం అవుతాయి.
వేలం పద్ధతి ద్వారా టికెట్లు అమ్మడం ఎక్కువ టికెట్ ధరలకు దారితీస్తుందని, ఇది ఆర్థికంగా ప్రేక్షకులపై భారంగా మారుతుందనే విమర్శలు ఉండవచ్చు. కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసుకోవడం అభిమానులకే గౌరవంగా భావిస్తారు. ఈ ప్లాన్ కోసం ప్రభుత్వ అనుమతులు పొందితే, ‘పుష్ప 2’ క్రేజ్ మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ కొత్త ఆలోచన ఎంత వరకు అమలు చేస్తారో వేచి చూడాలి.
Follow
Follow
Post a Comment