అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప: ది రూల్ భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ప్రీమియర్ షో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ప్రీమియర్ షో డిసెంబర్ 4న ప్రముఖ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆ థియేటర్ మరేదో కాదు.. హైదరాబాద్ లోని విమల్ థియేటర్. ఈ ప్రీమియర్ ద్వారా ప్రేక్షకుల మొదటి స్పందనను తెలుసుకోవడమే కాకుండా, మరింత బజ్ సృష్టించాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్ వల్ల ఈ షో పుష్ప 2 పై అంచనాలను మరో మెట్టుపైకి తీసుకెళ్లనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక యూఎస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో సాగుతుండగా, 1 మిలియన్ డాలర్ల మార్క్ దాటడం విశేషం. హైదరాబాద్‌లో ప్రీమియర్ షో నిర్వహణతో, ఫ్యాన్స్ పండగ వాతావరణంలో సినిమా బజ్ ను ఆస్వాదించబోతున్నారు. ఈ ప్రీమియర్ షోకు చిత్రబృందం మరియు ఇతర సెలబ్రిటీలు హాజరుకావచ్చని సమాచారం. ఇక భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు.
Follow
Follow
Post a Comment