డిసెంబర్ 5న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2: ది రూల్‌పై విపరీతమైన హైప్ ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే హిందీ మార్కెట్‌లో బలమైన బజ్ ఏర్పాటుచేసుకుంటోంది. అనిల్ తడాని డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను చేపట్టి బాలీవుడ్ స్క్రీన్ కౌంట్‌ను భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా పోటీ లేని సోలో రిలీజ్ పుష్ప 2కు అదనపు లాభం.
పుష్ప 2 వెయ్యి కోట్ల క్లబ్ చేరతాడా అనే ప్రశ్నకు విశ్లేషకులు పాజిటివ్ సమాధానమే ఇస్తున్నారు. నార్త్ ఆడియన్స్ లో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ కంటెంట్ ఈసారి మరింత మాస్‌తోపాటు యూనివర్సల్ టచ్ ఇచ్చినట్లయితే, బాలీవుడ్‌లోనే 300 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలుగురాష్ట్రాలు, ఇతర సౌత్ మార్కెట్లలో మరో 600 కోట్ల గ్రాస్ సాధించడం పెద్ద విషయం కాకపోవచ్చు.
విజయం సాధించడమే కాదు, పుష్ప 2కు అందరూ ఎదురుచూస్తున్నాడు కాబట్టి, టికెట్ రేట్ల పెంపు కూడా కలెక్షన్లను మరింత పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే పండుగల సీజన్ వరకు మరే పెద్ద సినిమా థియేటర్లలో పోటీగా లేకపోవడం మరో ప్లస్ పాయింట్. భారీ హైప్, ట్రెండ్‌కు తగ్గట్టుగా ‘పుష్ప 2’ విజయం సాధిస్తే బాహుబలి, కేజీఎఫ్ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించవచ్చనే నమ్మకం ఉంది. బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే మాత్రం వెయ్యి కోట్లు ఏ మాత్రం అసాధ్యం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. మరి పుష్పరాజ్ ఈ సారి రికార్డులను ఎలా తిరగరాస్తాడో చూడాలి!
Follow
Follow
Post a Comment