దేవర స్ట్రాటజీతో పుష్ప రాజ్ ప్లాన్


సూపర్ హిట్ సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నాయి, అందులో ఒకటి ఐటెం సాంగ్, ఇది అల్లు అర్జున్, శ్రీలీలపై చిత్రీకరించనున్నారు. ఈ పాటను ఈ వారం షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో పాట కూడా ఉంది కానీ, ఈ పాటని అసలు చిత్రంలో ఉంచాలా? వద్దా? అనే విషయంలో చిత్రబృందం ఆలోచనలో పడింది.


సినిమా లెంగ్త్ పెరగడం, అలాగే కొత్తగా పెద్ద ప్రయోజనం లేని కారణంగా, ఈ పాటను పక్కనపెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘పుష్ప 2’ డిసెంబరు 5న విడుదల కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ కోసం సమయం తక్కువగా ఉంది. అందువల్ల సుకుమార్ ఈ పాటపై ఖర్చు చేయడం కంటే, టైమ్ సేవ్ చేసేందుకు దాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఐటెం సాంగ్ పూర్తయిన తర్వాత టైమ్ బట్టి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఆ పాట ఆడియోలో ఉంటుందేమో గాని, సినిమాలో మాత్రం ఉండకపోవచ్చు.

ఇదే పరిస్థితి ఇటీవల దేవర చిత్రంలోనూ ఎదురైంది. దావుదీ పాట షూట్ చేసినప్పటికీ, కథలో సరిగా ఒదిగిపోకపోవడంతో సినిమా రిలీజ్‌కు ముందు దాన్ని తొలగించారు. కానీ ఆ తరువాత ఆడియెన్స్ రెస్పాన్స్ పెరగడంతో మళ్ళీ సినిమాలో జత చేశారు. అదే విధంగా, పుష్ప 2 చిత్రానికి కూడా చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ వారం ఈ పాటపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు 4న ప్రీమియర్ షోలు మొదలవుతాయని కూడా సమాచారం.

Post a Comment

Previous Post Next Post