‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ, ఇండియాలో బెస్ట్ యంగ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ లైనప్ లో ‘జై హనుమాన్’ సీక్వెల్ తో పాటు, బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఉంది. అలాగే ‘మహాకాళి’ మరియు ‘అధీరా’ వంటి ప్రాజెక్ట్స్ ని కూడా ప్రశాంత్ వర్మ రెడీ చేస్తున్నాడు, వీటిని ఇతర దర్శకులతో చేయిస్తుండటం విశేషం.
తాజాగా ‘బ్రహ్మ రాక్షస’ కాన్సెప్ట్ పై ప్రభాస్ కి కథ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ప్రభాస్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ‘జై హనుమాన్’ సినిమా రిజల్ట్ ఆధారంగా ‘బ్రహ్మ రాక్షస’ కోసం ప్రభాస్ తో సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అది హిట్టయితేనే నిర్మాతలు అతనిని నమ్మి గ్రాండ్ బడ్జెట్ పెట్టేందుకు ధైర్యం చేసే అవకాశం ఉంటుంది. అసలే ప్రభాస్ సినిమాల బడ్జెట్ ఇప్పుడు 400 నుంచి 500 కోట్ల మధ్యలో ఉంది. అయితే ప్రభాస్ కు చెప్పిన ఆ కథ గతంలో రణవీర్ సింగ్ తో చేయాలని అనుకున్నప్పటికీ, క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తుండటంతో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ మరింత టైమ్ పట్టవచ్చని భావిస్తున్నారు.
Follow
Post a Comment