భారీ చిత్రాలతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. బాహుబలి తర్వాత తన రేంజ్‌ను చూపిస్తూ, సలార్, కల్కి చిత్రాలతో మాస్ క్రేజ్‌ను మరోసారి రుజువు చేశాడు. ప్రస్తుతం అతని చేతిలో రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్), స్పిరిట్, సలార్-2, కల్కి-2 లాంటి భారీ ప్రాజెక్టులు ఉండటం వల్ల నాలుగేళ్ల పాటు కొత్త సినిమాలు ఒప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే, ప్రభాస్ కొత్త ప్రాజెక్టుల గురించి పుకార్లు మాత్రం ఆగట్లేదు. రణ్వీర్ సింగ్‌తో చేయాల్సిన బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పటికీ, అదే కథను ప్రభాస్‌తో చేయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు టాక్. ఈ కథలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్ర పట్ల ప్రభాస్ ఆసక్తి చూపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రకటించబడే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.
అదే విధంగా, ‘ఆదిపురుష్’ అనంతరం ఓం రౌత్‌తో మరోసారి కలుస్తున్నారనే రూమర్ కూడా పుట్టుకొచ్చింది. ఓం రౌత్ చారిత్రక నేపథ్య కథతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆదిపురుష్ అనుభవం వల్ల ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రూమర్స్ కు అయితే అసలు గ్యాప్ రావడం లేదు. రోజుకోటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనే ఫ్యాన్స్‌కు స్పష్టత ఇస్తుంది. ఇక సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఓ సినిమా ఉందట. లోకేష్ కూడా ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. చూస్తుంటే ప్రభాస్ వచ్చే పదేళ్ళకి సరిపడా ప్రాజెక్టులను సెట్ చేసుకున్నట్లు అనిపిస్తోంది.
Follow
Follow
Post a Comment