ఇండియన్ సినిమా లో ప్రభాస్ అంటేనే రికార్డ్ బ్రేకింగ్ హీరో. ప్రస్తుతం అతని సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతూ, ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2898ఏడీ’ సహా ఐదు ప్రాజెక్ట్స్ ఉండగా, వీటిలో మూడు సినిమాలు 1000 కోట్ల క్లబ్ చేరే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న హోంబలే ఫిలిమ్స్, ప్రభాస్ తో ‘సలార్’ చేసిన తరువాత ఇప్పుడు ‘సలార్ 2’కి సన్నాహాలు పూర్తి చేసింది. హోంబలే ప్రభాస్‌తో మూడు సినిమాలు చేయడానికి డీల్ కుదుర్చుకున్నట్లు నిర్మాత విజయ్ కిరంగదూర్ ఇటీవల ప్రకటించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సింగిల్ సిట్టింగ్ లో ప్రభాస్ నిర్మాతల నుంచి 600 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
అంటే ఒక్కో సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్‌గా ఇవ్వనున్నారు. ఈ భారీ డీల్ ప్రభాస్‌ను ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ పొందుతున్న స్టార్లలో ఒకడిగా నిలబెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150-200 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హోంబలే సినిమాలు 2026 నుంచి 2028 వరకు విడుదల కానున్నట్లు సమాచారం.
Follow
Post a Comment