పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బలమైన స్నేహం గురించి అందరికీ తెలుసు. ‘జల్సా’ మూవీతో మొదలైన వారి ఈ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సినిమాల ద్వారా కాకుండా వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒకరిపై మరొకరికి బలమైన గౌరవం ఉంది. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండగా త్రివిక్రమ్ ఆయన కోసం కథలను సజెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు వీరి కాంబోలో మూడు చిత్రాలు వచ్చాయి, చివరిసారిగా 2018లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మరో సినిమా రాలేదు. అయితే, పవన్ మరియు త్రివిక్రమ్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ ఇద్దరూ కలిసి ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. 2029 ఎన్నికలకు ముందు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ఆసక్తి పెరిగింది.
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఒక పెద్ద స్టార్ హీరోతో, భారీ స్థాయిలో పొలిటికల్ థీమ్ మీద సినిమాను రూపొందించాలని అనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక నాగవంశీ పవన్ త్రివిక్రమ్ కాంబోపైనే స్పందించారని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
Follow
Follow
Post a Comment