సితార ఎంటర్టైన్మెంట్స్.. హారిక హాసిని అనుబంధ సంస్థ అయినప్పటికీ, ప్రస్తుతం టాలీవుడ్లో ప్రధాన బ్యానర్‌గా ఎదిగింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వంటి సినిమాల విజయంతో, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రవితేజల ప్రాజెక్టులతో ఈ సంస్థ మరింత బిజీగా ఉంది. తాజాగా, ఈ బ్యానర్ మరో భారీ పాన్ ఇండియా సినిమా నిర్మించబోతుందని సమాచారం.
అదే ఎన్టీఆర్-నెల్సన్ కాంబినేషన్లో రాబోయే సినిమా. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలే అయినా, ఆయనకు భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా విజయ్ బీస్ట్, రజనీకాంత్ జైలర్ వంటి సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో తన తదుపరి సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరతో బిజీగా ఉండగా, తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా చేస్తారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తైన వెంటనే, నెల్సన్ సినిమాపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సితార బ్యానర్ లోనే రానున్నట్లు తెలుస్తోంది. కాంబినేషన్ సెట్టయితే ఇదే ఆ సంస్థకు మొదటి బిగ్ బడ్జెట్ సినిమా అవుతుంది. విజయ్ దేవరకొండతో సితార చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే అయినా, ఎన్టీఆర్-నెల్సన్ సినిమా దానికి మరింత పెద్దదిగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న ఈ కథ, ఎన్టీఆర్ ఎనర్జీకి తగిన విధంగా ఉంటుందని సమాచారం.
Follow
Follow
Post a Comment