ఈవారం చిన్న సినిమాల రష్..ఒక్కటైన క్లిక్కయ్యేనా?


నవంబర్ నెల ప్రారంభంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీపావళికి విడుదలైన లక్కీ భాస్కర్, క, అమరన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కంటెంట్ బలంతో ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుండడంతో, నవంబర్ తొలి వారంలో విడుదల కాబోయే సినిమాల పట్ల ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది. ఈ వారం రాబోయే సినిమాలకు బజ్ లేకపోవడంతో, డిస్ట్రిబ్యూటర్స్ లో ఆందోళన నెలకొంది.


ఈ వారంలో కాస్త ఆసక్తిని రేకెత్తించిన చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం హఠాత్తుగా ప్రచారంలోకి రావడంతో టీం ఆఘమేఘాల మీద ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. నవంబర్ 8న విడుదలకానున్న ఈ చిత్రం కొంత దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇతర చిత్రాల విషయానికి వస్తే, ధూమ్ ధామ్, జితేందర్ రెడ్డి, జాతర, ఈసారైనా, రహస్యం ఇదం జగత్, వంచన, జ్యూయల్ థీఫ్ లాంటి సినిమాలు విడుదలకానున్నాయి. 

వీటిలో రెండు మూడు చిత్రాలు మాత్రమే పబ్లిసిటీ పరంగా ఆకర్షణీయంగా ఉన్నా, ఓపెనింగ్స్ రాబట్టడం చాలానే కష్టంగా కనిపిస్తోంది. పబ్లిక్ టాక్ కూడా అనూహ్యంగా ఉంటే తప్ప ఈ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు తేవడం డౌటే. ఇదే వారం లో మరొక ప్రత్యేకత ఏమిటంటే, నవంబర్ 7న తమిళ డబ్బింగ్ సినిమా బ్లడీ బెగ్గర్ కూడా విడుదలవుతోంది. 

జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో కెవిన్ హీరోగా నటించాడు. తమిళంలో డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మన ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇదే వారం విడుదల కాబోయే తొమ్మిది సినిమాలపై మొదటి వారం వసూళ్లు కీలకం కానున్నాయి. నవంబర్ 14న సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లా దేవకీనందన వాసుదేవ విడుదలకు సిద్ధంగా ఉండడంతో, ఆ సినిమాలకు మార్కెట్ ముందుగానే క్లియర్ కావడం కీలకంగా మారింది.

Post a Comment

Previous Post Next Post