తమిళ సినిమా ప్రముఖులు నయనతార, ధనుష్ మధ్య తాజా వివాదం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నయనతార రాసిన ఓ సుదీర్ఘ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీంతో వీరిద్దరి మధ్య పాత విభేదాలు గట్టిగానే ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, నయనతార జీవిత కథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ 'నయన్ బియాండ్ ది ఫెయిరీ టేల్' త్వరలో ప్రసారం కానుంది.
ఇందులో ఆమె నటించిన 'నేనూ రౌడీనే' సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించారు. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాత కావడంతో, తన అనుమతి లేకుండా వీడియోను ఉపయోగించారంటూ ఆయన కాపీరైట్ కేసు పెట్టారు. నయన్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడాన్ని అసహజంగా భావించి, తన ఆగ్రహాన్ని లేఖ రూపంలో వ్యక్తం చేసింది.
నయనతార తన లేఖలో ధనుష్‌ను తీవ్రంగా విమర్శించింది. మూడు సెకన్ల క్లిప్ కోసం ఈ మేర డిమాండ్ చేయడం దారుణమని, ధనుష్ తన అహంకారాన్ని ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా మొదలైన విబేధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఆ క్రోధమే ఇప్పుడు ఇలా బయటపడిందని చెప్పింది. ఈ వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార ఈ లేఖతో తన వాదనను బలపరచగా, ధనుష్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Follow
Follow
Post a Comment