దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా, దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటున్న ఈ సినిమా, బ్యాంకింగ్ రంగంలో భాస్కర్ అనే వ్యక్తి లొసుగులను ఎలా సద్వినియోగం చేసుకున్నాడనే కథతో రూపుదిద్దుకుంది. ఇదే కథను మొదట వెంకీ అట్లూరి పలువురు తెలుగు హీరోలకు వినిపించారు.
అందులో క్రేజీ హీరో నాని కూడా ఒకరు. అయితే, తాను ఇప్పటికే 'జెర్సీ', 'హాయ్ నాన్న' చిత్రాలలో తండ్రి పాత్రలు పోషించానని, మరొకసారి ఫాదర్ క్యారెక్టర్ లో కనిపించడం ఆసక్తికరం కాదని అభిప్రాయపడ్డారట. దాంతో, వెంకీ అట్లూరి ఈ కథను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు వినిపించగా, దుల్కర్ వెంటనే ఓకే చెప్పాడు. దుల్కర్ ఆ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్టయ్యాడు. దుల్కర్ నటన వల్లే ఈ చిత్రానికి మంచి స్పందనతో పాటు, వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. తండ్రి పాత్రలో దుల్కర్ ఆకట్టుకోవడంతో, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడని చెప్పాలి.
Follow
Post a Comment