నాగచైతన్యపై పెద్ద రిస్కే.. గ్రాఫిక్స్ కోసం 30 కోట్లా?


అక్కినేని హీరో నాగచైతన్య తన కెరీర్‌లో వెరైటీ పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుంటారు. ప్రస్తుతం ఆయన తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 7, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పూర్తవ్వగానే నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నారు. 

విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందబోయే ఈ మిస్టిక్ థ్రిల్లర్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుండగా, మరో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ సినిమా కోసం నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారని తెలుస్తోంది. 

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా రూ. 30 కోట్లను ఖర్చు చేయనున్నారట. అయితే నాగచైతన్య మార్కెట్ చూసుకుంటే ఇప్పటి వరకు సోలోగా 30 కోట్ల షేర్ కూడా చూసింది లేదు. కానీ నిర్మాత కంటెంట్ పైన నమ్మకంతో గట్టిగానే రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రధానమైన భాగాన్ని ఉత్తర భారతదేశంలోని వినూత్నమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారనుంది.

Post a Comment

Previous Post Next Post