నందమూరి కుటుంబం నుంచి మరో ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపొందుతోంది. ఇందులో తారక రామారావుకు జోడీగా వీణారావు నటిస్తున్నారు. ఆమెను అధికారికంగా పరిచయం చేసేందుకు వైవిఎస్ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. మోక్షజ్ఞ సినిమా మీ చిత్రంతో పోటీ పడుతుందా? అని ప్రశ్నించగా, వైవిఎస్ చౌదరి తనదైన సరళిలో స్పందించారు. “మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నందమూరి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా, వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటాను. మేము ఎవరికీ పోటీగా ఎప్పుడూ సినిమాలు విడుదల చేయము. ఇదే ఏడాది నందమూరి వారికో ప్రత్యేక సంవత్సరమవుతోంది.
ఎన్టీఆర్ సినిమాకు 75 ఏళ్లు, బాలకృష్ణ ఇండస్ట్రీకి 50 ఏళ్లు. ఇప్పుడు న్యూ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కూడా ఈ ఏడాది ఎంట్రీ ఇవ్వనున్నారు. మోక్షజ్ఞ సినిమా వచ్చే సమయంలో మా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనే లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మోక్షజ్ఞ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ముగింపుదశకు చేరుకున్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది నందమూరి అభిమానులకే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు పండగలా ఉండబోతోందని అంచనా.
Follow
Follow
Post a Comment