శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ముందుగా డిసెంబర్‌లోనే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు 2025 ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడిగా, జిమ్ సర్బా కోటీశ్వరుడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాపై హైప్ పెంచింది. అయితే, ఫిబ్రవరి నెల సినిమా విడుదలకు అంత అనుకూల సమయం కాదు. విద్యార్థులు పరీక్షలతో బిజీగా ఉండే ఈ సమయంలో, యువతను టార్గెట్ చేసే చిత్రాలకు కాస్త సవాలుగా ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత పెద్ద సినిమాల రద్దీ ఉండటం వల్ల, ఈ నిర్ణయం తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయానికి ఓటీటీ కంపెనీల ఒత్తిళ్లు కూడా ఉండటం, విడుదల తేదీపై ప్రభావం చూపించిందని టాక్.
ఎందుకంటే ఓటీటీ డీల్ తో అనుకున్న ధర రావాలి అంటే, ఓటీటీ స్ట్రీమ్ కు అనుకూలంగా ఉండేలా వాళ్ళు చెప్పిన టైమ్ లో సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఓటీటీ సంస్థలు కూడా ఒక్కో నెలలో ఒక్కో పెద్ద సినిమా స్ట్రీమింగ్ అయ్యేలా ప్రణాలికను రచిస్తున్నాయి. అందుకే కుబేర సినిమా విషయంలో రిస్క్ తీసుకుంటున్నట్లు టాక్. అయితే, శేఖర్ కమ్ముల చిత్రాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ వచ్చే ఛాన్స్ ఉంది, దీంతో, ఈ రిస్క్‌ని తగ్గించే అవకాశం కల్పిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow
Follow
Post a Comment