సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కీర్తి సురేష్ పేరు ప్రస్తుతం పెళ్లి పుకార్లతో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు, తమిళ సినిమాల్లో సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న కీర్తి, ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకొచ్చాయి.
కొచ్చికి చెందిన వ్యాపారవేత్త ఆంటోని తట్టిల్‌తో కీర్తి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ప్రేమ ప్రయాణం గత కొన్నేళ్లుగా నడుస్తున్నదని టాక్. ఆ ప్రేమను కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారట. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం, డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతుందని సమాచారం. కీర్తి సురేష్ పై ఇటువంటి పుకార్లు కొత్తేం కావు. గతంలో కూడా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలే అని కీర్తి కుటుంబ సభ్యుల క్లారిటీ ఇచ్చారు. అయితే ఈసారి వార్తలు ఎంత వైరల్ అవుతున్నా కూడా అధికారిక ప్రకటన లేదు. మరి రాబోయే సినిమా ప్రమోషన్ లో కీర్తి ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.
Follow
Post a Comment