సూర్య హీరోగా, సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’ సినిమా నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ ఫాంటసీ థ్రిల్లర్గా, భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, పది భాషల్లో విడుదలకానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో, దిశా పటానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
అయితే, విడుదల ముందే ‘కంగువా’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అంబానీ కి చెందిన నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, స్టూడియో గ్రీన్ సంస్థపై మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. స్టూడియో గ్రీన్ నుండి తమకు రావలసిన బాకీ మొత్తం చెల్లించకుండా, కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ, విడుదలను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు.
తాము ‘టెడ్డీ-2’, ‘తంగలాన్’ వంటి ప్రాజెక్టుల కోసం స్టూడియో గ్రీన్ కు రూ.99 కోట్లు రుణం ఇచ్చామని, ఇప్పటి వరకు రూ.45 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారని, మిగతా బాకీ తీర్చకుండా కాంట్రాక్ట్ ను పాటించలేదని రిలయన్స్ కోర్టులో పేర్కొంది. ఈ కారణంగా ‘కంగువా’ థియేట్రికల్ రిలీజ్ మరియు ‘తంగలాన్’ ఓటీటీ విడుదలపై కూడా ఆంక్షలు విధించాలని కోరింది. కేసు విచారణలో, స్టూడియో గ్రీన్ నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరడంతో, న్యాయమూర్తి కేసును నవంబర్ 7కి వాయిదా వేశారు.
Follow
Follow
Post a Comment